ATP: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం సన్నబియ్యం సరఫరా పెంచాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఎక్కువ మంది భోజనం చేస్తున్నందున బియ్యం సరిపోవడం లేదన్నారు. గత ప్రభుత్వం నాడు–నేడు పనులు అసంపూర్తిగా వదిలి వెళ్లిపోయిందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న పాఠశాల పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.