NZB : ఇతిహాస సంకలన సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘ఇందూరు జిల్లా సమగ్ర చరిత్ర’ పుస్తకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం సుభాష్ నగర్ నెహ్రూ యువ కేంద్రం ప్రాంగణంలో రచన నైపుణ్యాలపై సెమినార్ నిర్వహించారు. చరిత్ర, ఆలయాల ప్రాజెక్టులు, తదితర రచనలపై అవగాహన కల్పించారు.