AP: బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. ‘ఇప్పటికైనా చిరంజీవి స్పందించి లేఖ రాశారు. సినిమా వాళ్లను జగన్ ప్రభుత్వం గొప్పగా చూసుకుంది. జగన్- చిరంజీవి మధ్య సోదరభావం ఉంది. పేదలకు సినిమా అందుబాటులో ఉండాలని జీవోలు తీసుకొచ్చాం. రాజకీయాలకు, ప్రచారానికి సినిమావాళ్లని వాడుకుని చంద్రబాబు వదిలేస్తారు’ అని పేర్కొన్నారు.