WGL: దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. వరంగల్ కాశిబుగ్గలోని 19వ డివిజన్లో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వద్ద శనివారం ఆయన పూజలు నిర్వహించారు. నిర్వాహకులు, స్థానిక BRS నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.