AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి త్వరలోనే ప్రజాసేవలో పవన్ పాల్గొంటారు. ఓజీ చిత్రానికి వస్తున్న విశేష స్పందనను పవన్ ఆస్వాదించాలి’ అని పేర్కొన్నారు. అలాగే, మంత్రి లోకేష్ సైతం పవన్ త్వరగా కోలుకోవాలని.. ‘OG’ విజయాన్ని అభిమానులతో కలిసి ఆనందించాలని ఆకాంక్షించారు.