RR: షాద్నగర్ పట్టణానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన చెక్కులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందన్నారు.