GNTR: తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి విశేష అభిషేకాలు, అలంకరణలు చేశారు. సమీప ప్రాంతాల భక్తులు ఆలయానికి వచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.