ఎన్నికల వేళ బీహార్లో మహిళలకు మేలు చేసే పథకాన్ని తీసుకొచ్చారు. బీహార్ సీఎం మహిళా రోజ్గార్ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 75 లక్షల మంది మహిళలకు ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.