AP: మాజీ సీఎం జగన్పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సీఎంతో సమానంగా పవన్ ఉండటంతో బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ‘అసెంబ్లీలో బ్రీత్ ఎనలైజర్ పెట్టి పరీక్షించాలి. సైకో అంటున్నారు.. అసలు సైకో బాలకృష్ణ. పురాణాలు, పద్యాలు బట్టిపట్టడం కాదు. చిరంజీవిని జగన్ కలవన్నారని ఎవరికి చెప్పారు’ అని ఫైర్ అయ్యారు.