NZB: SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. గురువారం ఉదయం ఎగువ నుంచి 3,15,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్‌ఫ్లోగా 1,22,516 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 39 వరద గేట్ల ద్వారా 1,10,925 క్యూసెక్కులు గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. IFFC ద్వారా 2,000, కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కుల నీరు పోతోంది.