VZM: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పర్యటన శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టరేట్ వద్ద ఆమెకు డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఐసీడీఎస్ పీడీ విమలారాణి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆమె జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే నవరాత్రి పోషణ్ మహా కార్యక్రమంలో శైలజ పాల్గొన్నారు.