NZB: బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో రూ. 2 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ MLA ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.