చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో మిగ్ 21కు వాయిసేన కేంద్రం ఘనంగా వీడ్కోలు పలికింది. IAF చీఫ్ ఏపీ సింగ్ సహా ఆరుగురు స్కాడ్రన్ లీడర్లు చివరిసారి సార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహన్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి హాజరయ్యారు.