JN: జనగామ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. 7 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు.