MDK: తూప్రాన్‌లో చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గణేష్ రెడ్డి, నాచగిరి ఆలయ ఛైర్మన్ రవీందర్ గుప్తా, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నందల శ్రీనివాస్ నాయకులు నాగరాజుగౌడ్, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు. అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.