TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిర్పూర్.టి మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పశువులకాపరి దూలం శేఖర్, సుశీలగా పోలీసులు గుర్తించారు. వారిద్దరి మృతదేహాలపై గాయాలు ఉన్నట్లు సమాచారం. అడవి జంతువులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.