BDK: మణుగూరు మండలం విజయనగరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం సింగరేణి కార్మికుడు తన ద్విచక్ర వాహనంపై నైట్ డ్యూటీకి వెళ్లి వస్తుండగా విజయనగరం నాగులమ్మ గుడి దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎటువంటి పార్కింగ్ సిగ్నల్ లేకుండా నడి రోడ్డు మీద లారీని నిలిపి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.