TG: ఈ నవమిలోపు తన విషయం తేల్చకపోతే జీవసమాధి అవుతానని.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన DSP నళిని అన్నారు. తన గురించి CM రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అధికారినైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తానిచ్చిన రిపోర్టుపై 21 నెలలుగా చర్యలు తీసుకోకుండా నిర్లిప్తంగా ఉన్నారన్నారు.