MBNR: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పరిస్థితులపై అన్ని శాఖల ఉన్నత అధికారులతో సమీక్షించారు. దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల మేరకు సూచించారు.