MHBD: తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ సమీపంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పై ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన వెలికట్ట గ్రామ యువకులు శుక్రవారం చొరవ తీసుకొని రోడ్డు పై ఉన్న గుంతలను మట్టితో పూడ్చి వేశారు. వారి ఈ సామాజిక చైతన్య చర్యను గ్రామస్థులు అభినందించారు.