KMM: ముదిగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ సీ. యచ్. సీ నెలకొండపల్లి రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులు తగు చూచనలు అందజేశారు. అలాగే దంత సమస్యలపై అవగాహన కల్పిస్తూ తగిన సూచనలు చేశారు.