TG: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను CM రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలపై CS, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. HYDలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.