KDP: జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఇందులో భాగంగా సుగుమంచిపల్లి బీడు భూముల్లో కనిపించిన మృతుడు తెల్లటి షర్టు, ఆకుపచ్చని ప్యాంటు ధరించి ఉన్నాడు. ఈ మేరకు కాలి బొటన వేలికి ఫీట్స్ వచ్చినప్పుడు వాడే కడియం ఉంది. వ్యక్తిని గురించి తెలిసిన వారు జమ్మలమడుగు CI 9121100603 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు తెలిపారు.