WGL: సంగెం మండల కేంద్రంలో శుక్రవారం హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. సంగెం నుంచి తిమ్మాపురం వెళ్తుండగా, బ్రిడ్జి వద్ద టూ వీలర్‌ను తప్పించబోయి బస్సు బ్రిడ్జి కిందకు జారింది. బస్సులో 20-30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరికి స్వల్ప గాయాలు కాగా, అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.