AP: అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ ప్రారంభోత్సవానికి మండలి ఛైర్మన్‌ను ఆహ్వానించే విషయంలో పొరపాటు జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మండలి ఛైర్మన్‌ను ఆహ్వానించకుండా అధికారులు పొరపాటు చేశారని తెలిపారు. జరిగిన ఘటనను కులాలకు ఆపాదించడం సరికాదని హితవు పలికారు. దళితుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు.