ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు గిరిజన ఆశ్రమ పాఠశాలల హాస్టల్స్ డైలీవేజ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15 రోజుల సమ్మెకు MLA కోవ లక్ష్మి శుక్రవారం సంపూర్ణ మద్దతు పలికారు. అధికారంలోకి రాగానే హామీలన్నీ పక్కన పెట్టి నాటకాలు ఆడుతున్నారన్నారు. కార్మికుల కడుపు కొట్టడం న్యాయమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.