AP: అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే ఎమ్మెల్యేల అంశంపై చర్చ జరగాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సభకు రాని ఎమ్మెల్యేల రాయితీలు రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై చర్చించాలని సూచించారు.