VSP: కనకమహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవముల ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు దైర్యలక్ష్మి అలంకారంలో తులసీదళాలతో సహస్రనామార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణకు విశాఖ వాస్తవ్యులు కె.సూర్య చాస్కరరావు రూ.30,000 విరాళం సమర్పించగా, కుటుంబ సభ్యులు పూజలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. రేపు అమ్మవారు సంతానలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు.