తెలంగాణలో టికెట్ ధరల పెంపు విషయంలో పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీకి మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. అక్టోబర్ 9 వరకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పింది. టికెట్లు రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చే నెల 9కి వాయిదా వేసింది.