VZM: కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం స్త్రీ శక్తి పోషణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగం, ప్రభుత్వ సంస్థలు సహా అన్ని కార్యాలయాలలో మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.