KRNL: పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో వెలిసిన శ్రీ పైరాంజనేయ స్వామి దేవస్థానానికి బెంగళూరుకి చెందిన భక్తురాలు రేష్మి గురురాజ సోలార్ ప్లాంట్ కోసం రూ.1,50,000 విలువ చేసే సోలార్ను శుక్రవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు, కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీర్వాదం మెండుగా ఉండాలని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.