CTR: ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణం గాంధీ విగ్రహం నుండి మెసానికల్ గ్రౌండ్స్ వరకు రన్ ఫర్ టూరిజం 2K.M రన్ కార్యక్రమం ఉ.7.00 గం. లకు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ ఏ రైటింగ్, వక్తృత్వ పోటీలు, నిర్వహించనున్నట్లు తెలిపారు.