MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక అని కొనియాడారు.