NLG: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ 135 జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘనమైన నివాళి అర్పించారు.