బ్లాక్ బస్టర్ హర్రర్ ఫాంటసీ సినిమా ‘తుంబాడ్’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో మేకర్స్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం నిర్మాణ సంస్థ ‘పెన్ స్టూడియోస్’ అధినేత జయంతిలాల్ గడాతో నిర్మాతలు చేతులు కలిపారట. ఇక ఈ సినిమా 2026లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.