ELR: జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 70 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించామన్నారు.