ELR: సాంఘిక సంస్కరణలు, సమాజం మార్పు కోసం తన కలాన్ని ఆయుధంగా మలచిన కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం సాహిత్య రంగానికి చేసిన కృషి అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. భీమడోలు శాఖ గ్రంధాలయంలో శుక్రవారం కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం 158 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంథ పాలకుడు కే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.