WNP: బాల్య వివాహాలను అరికట్టి, మహిళ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ‘మనకోసం-మన పిల్లల కోసం’ అనే అంశంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు దృష్టికి వచ్చినప్పుడు 1098కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.