CTR: వారానికి ఒకసారి CCIలలో ఉన్న పిల్లల ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా స్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ సంబంధించిన వివిధ అంశాలపై కమిటీ మెంబర్లతో జేసి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా బాల సంరక్షణ కేంద్రాలలో సందర్శించి సమస్యలను గుర్తించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.