NZB: ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి రైల్వే గేట్ వేస్తున్న సమయంలో ఓ ఆటో వేగంగా వచ్చి గేట్‌ని ఢీ కొనడంతో ఒక పక్క గేటు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ గేట్‌ను తాత్కాలికంగా వేసి వాహనాలను నిలిపి వేసి, అదే సమయంలో వచ్చిన రైళును పంపించారు. రైల్వే గేట్ మేన్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.