ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 550 పైన ఉన్న RMP, PMP ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని DYFI, KVPS నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం DMHO సీతారాంకి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వీరి ఆసుపత్రులలో పదుల సంఖ్యలో పడకలు ఏర్పాటు చేసుకొని అవసరం లేకుండా ప్రజలకు హైడోస్ ఇంజెక్షన్స్ ఇచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.