ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలో వివిధ పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఖమ్మం ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు నేరుగా టోల్‌ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నెంబర్ 9440446106 కు సంప్రదించాలని చెప్పారు. ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.