VZM: ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ఇంటింటికి వెళ్ళి జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలన్నారు.