ప్రకాశం: పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఎస్సీ కాలనీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని ఇళ్లను వరద నీరు చుట్టముట్టింది. ఈ మేరకు గ్రామంలోని డ్రైనేజీ కాలువలు, పంట పొలానికి సంబంధించిన కాలువలు పూడిపోవటం వల్లే ఈ సమస్య ఏర్పడింది గ్రామస్థులు చెబుతున్నారు.