MHBD: జిల్లా కేంద్రంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం 5వ రోజు దుర్గాదేవి మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. కమిటీ సభ్యులు రూ.5 లక్షల కరెన్సీతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఈ అద్భుత అలంకరణతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.