ఏలూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ శివ కిషోర్ మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఈనెల 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చోరీ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బంగారం, వెండి చోరీ జరిగినట్లు బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు చేసిందన్నారు.