SRCL: ఇటీవల కురిసిన వర్షాలతో ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం – రాచర్ల తిమ్మాపూర్ దారిలో రహదారి దెబ్బతింది. దీనిని పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సీసీ రోడ్డు మంజూరు చేయాలని ఎంపీడీఓ సత్తయ్యను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ సబేరా బేగం, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.