AP: అన్నదాత సుఖీభవ అమలులో కూటమి సర్కార్ విఫలం అయిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. రైతులకు కండిషన్లు లేకుండా రూ.20 వేలు ఇస్తామని.. మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది రూ.5 వేలే ఇచ్చారని మండిపడ్డారు. గతంలో తాము 53 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇస్తే.. కూటమి సర్కార్ వచ్చాక 46 లక్షల మందికి ఇస్తున్నారని తెలిపారు.