KNR: నిబంధనలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమన్నారు.