MDK: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రొసీడింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్యలతో కలిసి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.